రాజానగరంలో ఇంటింటా సర్వే

ABN , First Publish Date - 2020-06-21T09:57:09+05:30 IST

రాజానగరంలోని సంతమార్కెట్‌ వెనుక అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తికి శనివారం కొవిడ్‌ సోక డంతో పరిసర ప్రాంతంలో 127గృహాల్లో నివసిస్తున్న 309

రాజానగరంలో ఇంటింటా సర్వే

రాజానగరం, జూన్‌ 20: రాజానగరంలోని సంతమార్కెట్‌ వెనుక అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తికి శనివారం కొవిడ్‌ సోక డంతో పరిసర ప్రాంతంలో 127గృహాల్లో నివసిస్తున్న 309 మందికి సంబంధించి ఇంటింటా సర్వే చేపట్టినట్టు పీహెచ్‌సీ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. రాజానగరానికి చెందిన ఓ వ్యక్తి బీహార్‌ రాష్ట్రం పాట్నా సమీపంలోని థైమారులో షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.


కొద్దిరోజులుగా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నందున కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చేందుకు ఈనెల 16న మధురపూడి విమానాశ్రమం చేరుకున్నాడు. అక్కడి వైద్యసిబ్బంది వారిని బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. నలుగురికి వైద్యపరీక్షలు నిర్వహించగా కుటుంబ యజమానికి పాజిటివ్‌ రాగా కుటుంబసభ్యులకు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి.

Updated Date - 2020-06-21T09:57:09+05:30 IST