బీమా మిత్ర క్లెయిమ్‌లను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-10-01T07:27:45+05:30 IST
డీఆర్డీఏ ద్వారా అమలుచేస్తున్న పథకాల్లో బీమా క్లెయిమ్‌లు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలని డీఆర్డీఏ
డీఆర్డీఏ పీడీ
సామర్లకోట, సెప్టెంబరు 30: డీఆర్డీఏ ద్వారా అమలుచేస్తున్న పథకాల్లో బీమా క్లెయిమ్‌లు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ కోరారు. బుధవారం సామర్లకోట టీటీడీసీ ఆవరణలో జిల్లాలోని బీమా మిత్రల సమావేశాన్ని జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు మధుబాల, పల్లవి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పీడీ మాట్లాడుతూ పెండింగులో ఉన్న 1,196 క్లెయిమ్‌ల సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. వైఎస్సార్ బీమా నమోదులో భాగంగా రైస్ కార్డుల సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలన్నారు. ఏపీడీ కె.శ్రీనివాస్‌కుమార్, మెప్మా ఇన్సూరెన్స్ ఏరియా కో-ఆర్డినేటర్ వేదకుమారి, ఏరియా కో-ఆర్డినేటర్లు, ఏపీఎంలు భీమా మిత్రలు పాల్గొన్నారు.