ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2020-10-01T07:22:41+05:30 IST
పట్టణ, మండల పరిధిలో ఎరువులు, పురుగు మందుల విక్రయ దుకాణాలను వ్యవసాయ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వ్యవసాయ
సామర్లకోట, సెప్టెంబరు 30: పట్టణ, మండల పరిధిలో ఎరువులు, పురుగు మందుల విక్రయ దుకాణాలను వ్యవసాయ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ కాకినాడ సహాయ సంచాలకురాలు జీవీ పద్మశ్రీ, మండల వ్యవసాయాధికారిణి ఐ.సత్య మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగుకు అవసరమైన ఎరువులను ఎమ్మార్పీకి మించి అధిక ధరకు విక్రయించరాదన్నారు.
పట్టణ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్లో మూడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి గోదాములోని నిల్వలను లెక్కించి సరి చూశారు. వీకే రాయపురంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నమూనాలను సేకరించి విశ్లేషణ నిమిత్తం తీసుకెళ్లారు. దుకాణాల లైసెన్సుల రెన్యువల్, యాజమాన్య ధ్రువపత్రాలను పరిశీలించి పరిశీలించి జెరాక్స్ పత్రాలను తీసుకెళ్లారు.