అసంపూర్తిగా సమాచార హక్కు చట్టం

ABN , First Publish Date - 2020-11-13T06:05:57+05:30 IST

కాకినాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 15 ఏళ్లవుతోన్నా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికీ అసంపూర్తిగానే అమలవుతోందని చట్టం జిల్లా సభ్యుడు గేదెల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు

అసంపూర్తిగా సమాచార హక్కు చట్టం

కాకినాడ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 15 ఏళ్లవుతోన్నా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికీ అసంపూర్తిగానే అమలవుతోందని చట్టం జిల్లా సభ్యుడు గేదెల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి సమాచారం లభించకపోవడం గమనిస్తుంటే చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో 41బీ ప్రకారం 17 అంశాలు పొందుపరచాలని కానీ ఇది ఎక్కడా అమలుకావడం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాలను ఆయా శాఖలు ఎప్పటికపుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏదైనా సమాచారం అడుగుతుంటే నెట్‌లో చూసుకోవాలంటూ అధికారులు నిర్లక్షంగా సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం అమల్లో జిల్లాలో ఉన్న పరిస్థితులను రాష్ట్ర ఆర్టీఏ కమిషనర్‌, జనరల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరికీ తెలియజేస్తానని చెప్పారు


Updated Date - 2020-11-13T06:05:57+05:30 IST