మోదీ పాలనలో పెరిగిన మతోన్మాదం

ABN , First Publish Date - 2020-10-03T06:45:05+05:30 IST

ప్రధాని మోదీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని, మతసామరస్యం మంటగలిసిపోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి

మోదీ పాలనలో పెరిగిన మతోన్మాదం

సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు 


రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 2: ప్రధాని మోదీ పాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని, మతసామరస్యం మంటగలిసిపోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని, లౌకిక రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం జాంపేట గాంధీ విగ్రహం ఎదుట సీపీఐ నగర  సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వాతంత్య్రం మోదీ పాలనలో వెనక్కి వెళ్లిపోయిందన్నారు. బీజేపీ పాలనలో మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఉత్తర్రపదేశ్‌లో జరిగిన దళిత మహిళ ఘటన దేశానికి మాయనిమచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, నగర కార్యవర్గసభ్యులు బొమ్మసాని రవిచంద్ర, నౌరోజీ, సూర్యనారాయణ, నల్లా భ్రమరాంబ, శెట్టి నాగమణి, గౌరీశ్వరి, ఉమా, యడ్ల అప్పారావు, రాయి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


దాడులపై బాధ్యత ప్రభుత్వానిదే 

సీతానగరం: దళితులపై జరుగుతున్న దాడులకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్సి వేమగిరి వెంకట్రావు అన్నారు. సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని శిరోముండనం బాధితుడ్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సంఘటన జరిగి 2 నెలలు కావస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం దళితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వల్లే దాడులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఖండవల్లి జయప్రకాష్‌, చిడిపి స్టాలిన్‌, ఇండుమిల్లి సత్యవతి, వేమగిరి మేరి ఇండుగుమిల్లి రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:45:05+05:30 IST