తొలి విడతలో రూ. 780.68 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-09-12T10:34:56+05:30 IST
వైఎస్‌ఆర్ ఆసరా పఽథకం కింద తొలి విడతగా రూ. 780.68 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ అవుతుందని

వైఎస్‌ఆర్ ఆసరా నగదు నేరుగా సంఘాల పొదుపు ఖాతాల్లోకి..
కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), సెప్టెంబరు11: వైఎస్‌ఆర్ ఆసరా పథకం కింద తొలి విడతగా రూ. 780.68 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ అవుతుందని కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడ సతీష్ తదితరులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాలో 1 లక్షా 2 వేల 978 పొదుపు సంఘాల్లో గత ఏడాది ఏప్రిల్ నాటికి 10 లక్షల 14 వేల 788 మంది మహిళలకు సంబంధించి రూ. 3,122 కోట్ల 72 లక్షల మేర అప్పు ఉందని, ఈ మొత్తం నాలుగేళ్లలో వైఎస్‌ఆర్ ఆసరా పఽథకం కింద సంఘాల పొదుపు ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అనంతరం డీఆర్‌డీఏ-సెర్ప్ ద్వారా రూ 636.64 కోట్లు, మెప్మా ద్వారా రూ 143.04 కోట్లకు సంబoధించి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ జి రాజకుమారి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై హరిహరనాఽఽథ్, మెప్మా పీడీ కె శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు.