సచివాలయాల ద్వారా ప్రజలకు తక్షణ సేవలు

ABN , First Publish Date - 2020-10-07T09:02:52+05:30 IST

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు తక్షణం అందుతున్నాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు...

సచివాలయాల ద్వారా ప్రజలకు తక్షణ సేవలు

అంబాజీపేట, ఆక్టోబరు 6: సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు తక్షణం అందుతున్నాయని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. కె.పెదపూడి, గంగలకుర్రు గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవనాలకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం కె.పెదపూడి నందెపువారిపాలెంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.60లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్‌పర్సన్‌ వాసంశెట్టి వరలక్ష్మి, బూడిద వరలక్ష్మి, నాగవరపు నాగరాజు, వాసర్ల మరిడి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, దొమ్మేటి నాగన్న, ఉందుర్తి ఆనందబాబు, దొమ్మేటి సత్యమోహన్‌ పాల్గొన్నారు.

Read more