45 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2020-03-13T09:34:04+05:30 IST

ఏకకాలంలో నలభై ఐదు మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌గా కారణంగా సంఘటన జరిగినట్టు వైద్యులు ప్రాథమికంగా తేల్చి చెప్పారు.

45 మంది విద్యార్థులకు అస్వస్థత

కలుషిత ఆహారం తినడంతో వాంతులు, విరోచనాలు.. ఆసుపత్రికి తరలింపు

పరిస్థితిని సమీక్షించిన ఐటీడీఏ పీవో 


చింతూరు, మార్చి 12: ఏకకాలంలో నలభై ఐదు మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌గా కారణంగా సంఘటన జరిగినట్టు వైద్యులు ప్రాథమికంగా తేల్చి చెప్పారు. చింతూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 360 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. అందరూ ఎప్పటి మాదిరిగానే గురువారం మధ్యాహ్న భోజనం చేశారు. వారి లో 45 మందికి వాంతులు, విరోచనాలు అవుతుండడంతో వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.


విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో ఎ.వెంకటర మణ ఆసుపత్రి వైద్యులతోపాటు డివిజన్‌లోని పలు ఆసుప త్రుల వైద్యులను కూడా ఏరియా ఆసుపత్రికి తరలిరావాల్సిం దిగా ఆదేశించారు. దీంతో వైద్యులంతా విద్యార్థులకు చికిత్స అందించారు. విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారు. కలు షిత ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక పరీక్షలో తేలిందని పీవో వెంకటరమణ తెలిపారు. పరిశోధన చేయించి కారణాలను స్పష్టం చేస్తామన్నారు. 


డీఎస్పీ పరామర్శ

విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న చింతూరు డీఎస్పీ ఖాదర్‌బాషా ఆసుపత్రికి చేరుకొని విద్యా ర్థులను పరామర్శించారు. సంఘటనపై ఆరా తీశారు. 


అరకొర పడకలు.. 

చింతూరు ఏరియా ఆసుపత్రిలో అరకొర పడకలు ఉండ డంతో ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి కానవచ్చింది. దీంతో విద్యా ర్థులు చికిత్స సమయంలో విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఆసుపత్రికి వచ్చే సాధారణ రోగులతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో గుమిగూ డడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా రద్దీగా మారింది.


మరుగుదొడ్లలో వెలగని లైట్లు..

విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అవుతున్న క్రమం లో వారు మరుగుదొడ్లను వినియోగించుకొనేందుకు అవస్థ పడాల్సి వచ్చింది. మరుగుదొడ్లలో లైట్లు వెలగకపోవడ మే దీనికి కారణం. విషయం గుర్తించిన వైద్య సిబ్బంది ఓ విలేకరి సహకారంతో లైట్లను ఏర్పాటు చేయించారు.


నరసింహాపురంలో పది మందికి కడుపునొప్పి

మండలంలోని నరసింహాపురం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పది మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతున్నారు. అరుగుదల లోపం కారణంగానే వారికి కడుపునొప్పి వచ్చిందని మాత్రలు వేయడంతో నొప్పి తగ్గిందని, ఇద్దరిని  మాతరం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.

Updated Date - 2020-03-13T09:34:04+05:30 IST