దివిస్‌ బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-12-30T05:47:01+05:30 IST

దివిస్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన గ్రామస్థులపై అక్రమంగా పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేయాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి పంతం నానాజీ డిమాండ్‌ చేశారు.

దివిస్‌ బాధితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

  • ఎస్పీ నయీం అస్మీకి పంతం నానాజీ వినతిపత్రం

కాకినాడ క్రైం, డిసెంబరు 29: దివిస్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన గ్రామస్థులపై అక్రమంగా పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేయాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి పంతం నానాజీ డిమాండ్‌ చేశారు. తొండంగి మండలం కొత్తపాకల, పంపాదిపేట గ్రామస్థులు, రైతులతో ఆయన మంగళవారం ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీని కలుసుకుని వినతిపత్రం అందించారు. కాలుష్య కారక దివిస్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమపై కంపెనీ యాజమాన్యం అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు. కంపెనీ నిర్మాణంపై కోర్టులో స్టే ఉన్నప్పటికీ నిర్మాణం చేస్తున్నారని, ఈ విషయమై గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్పీకి అందించారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సంగిశెట్టి అశోక్‌, వాసిరెడ్డి శివ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:47:01+05:30 IST