జాగ్రత్తలు పాటిస్తే కనోరా దూరం
ABN , First Publish Date - 2020-04-01T10:21:37+05:30 IST
ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ దగ్గరకు రాకుండా కట్టడి చేయవచ్చని రంపచోడవరం ఐటీడీఏ

జీఎస్‌ఎల్ కోవిడ్ హాస్పటల్‌ను పరిశీలించిన పీవో నిశాంత్‌కుమార్
రాజమహేంద్రవరం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ దగ్గరకు రాకుండా కట్టడి చేయవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో, రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్ల కోవిడ్ -19 ప్రత్యేకాధికారి నిషాంత్‌కుమార్ తెలిపారు. రాజానగరం మండలంలోని జీఎస్‌ఎల్ కోవిడ్ ఆసుపత్రిని మంగళవారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు జీసీసీ నుంచి ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించేందుకు సీతపల్లి గ్రామం వచ్చినట్టు ఆయన చెప్పారు. జీఎస్‌ఎల్ హాస్పటల్‌లో కరోనా వైరస్ బాధితులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.