వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన శిక్ష

ABN , First Publish Date - 2020-03-19T09:16:13+05:30 IST

ఇదిగో పులి... అదిగో తోక అన్న సామెతలా ఉంది ప్రస్తుత పరిస్థితి. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అదే పనిగా పోస్టింగ్‌లు పెడుతున్నారుv

వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన శిక్ష

(సామర్లకోట)

ఇదిగో పులి... అదిగో తోక అన్న సామెతలా ఉంది ప్రస్తుత పరిస్థితి. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు అదే పనిగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఇష్టమొచ్చినట్టుగా వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన శిక్ష తప్పదంటున్నారు. అటువంటి వారిపై సైబర్‌ క్రైం కింద కేసు నమోదు చేస్తామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ప్రసార మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పెట్టి ప్రజలను అందోళనకు గురిచేస్తే సహించబోమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. వ్యాధిగ్రస్తుడిని నిర్ధారించే అధికారాన్ని ఒక్క నోడల్‌ అధికారికి మాత్రమే కల్పించారు. అలాగే వ్యాధి సోకిన వారి పేర్లను కూడా బయటపెట్టొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. 


ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయరాదు

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిర్ఞయించిన ల్యాబ్‌ల్లో మాత్రమే చేయాలి. మనకి మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన ల్యాబ్‌ల్లో వ్యాధి పరీక్ష పేరుతో శాంపిల్స్‌ సేకరిస్తే కఠిన చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖను జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

Updated Date - 2020-03-19T09:16:13+05:30 IST