-
-
Home » Andhra Pradesh » East Godavari » husbend sucide attmept rajamundry
-
భార్య కోసం వెళ్తే కొట్టారని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-12-30T05:45:38+05:30 IST
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29: తన భార్యను తనతో పంపించాలని అత్తవారింటికి వెళ్తే దారుణంగా కొట్టి అవమానించడంతో భర్త పురుగుల మందుతాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. ఈ సంఘటన నగరం లోని తూర్పురైల్వేస్టేషన్ సమీపంలో జరి గింది. బాధితుడి కథనం ప్ర

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29: తన భార్యను తనతో పంపించాలని అత్తవారింటికి వెళ్తే దారుణంగా కొట్టి అవమానించడంతో భర్త పురుగుల మందుతాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. ఈ సంఘటన నగరం లోని తూర్పురైల్వేస్టేషన్ సమీపంలో జరి గింది. బాధితుడి కథనం ప్రకారం... గండేపల్లి మండలం బావారానికి చెందిన నమ్మి స్వామి కాండ్రేగుల గ్రామానికి చెందిన మ హేశ్వరి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ ఏడాది అక్టోబరు 23న సూర్యారావుపేట దుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నా రు. అయితే కె.లక్ష్మణ దొర అనే వ్యక్తి ఇద్దరి పెద్దలతో మాట్లాడి ఒప్పిస్తానని నమ్మించి గండేపల్లి రమ్మని, అక్కడకు వచ్చాక మహేశ్వరిని పుట్టింటివారికి అప్పగించాడు. దీంతో భార్యను తనతో పంపించాలని స్వామి కాం డ్రేగులకు వెళ్తే మహేశ్వరి తల్లిదండ్రులతో దారుణంగా కర్రల కొట్టడంతో మనస్థాపం చెందాడు. దీంతో సోమవారం రాత్రి రాజమహేంద్రవరం తూర్పురైల్వే స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగానని, తనను స్నేహితులు గుర్తించి వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారని స్వామి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం స్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.