మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T09:38:19+05:30 IST

రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ

మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల


రాజమహేంద్రవరం సిటీ, మే  29: రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆయ న నివాసం వద్ద శుక్రవారం ఏపీసీసీఎల్‌ఏ, భారత న్యాయవాదుల సంఘం, సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌, ఐఏపీఎల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చి ఏడు నెలలు దాటినా వరకూ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలకు మానవహక్కుల కమిషన్‌ అవసరం ఉందని, అం దువల్ల ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలోనూ లోకాయుక్త ఏర్పా టు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు పల్లి చంద్రశేఖర్‌, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, కాశి శ్రీను, ధర్మా, సునీల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T09:38:19+05:30 IST