నివేశన స్థలాల పంపిణీని వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-05T06:12:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్‌ కీర్తి అధికారులను ఆదేశించారు.

నివేశన స్థలాల పంపిణీని వేగవంతం చేయండి

జేసీ కీర్తిజేసీ

రాజానగరం, డిసెంబరు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంయుక్త కలెక్టర్‌ కీర్తి అధికారులను ఆదేశించారు. రాజానగరంతోపాటుగా మండల పరిధిలోని కానవరం, పల్లకడియం గ్రామాల్లో పేదల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివేశన స్థలాల విభజన ప్రక్రియను త్వరితగతిన ముగించి పట్లాలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సమకూర్చేలా అనువైన భూములను సేకరించి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి, తహశీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో ఎన్‌వీవీఎస్‌ మూర్తి, గృహనిర్మాణ సంస్థ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-05T06:12:52+05:30 IST