-
-
Home » Andhra Pradesh » East Godavari » house documents
-
ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ
ABN , First Publish Date - 2020-12-28T06:07:41+05:30 IST
అర్హులైన ప్రతిఒక్కరికి సొంతిళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్ లక్ష్యమని, ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు.

- సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
కాకినాడ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతిఒక్కరికి సొంతిళ్లు ఇవ్వాలనేది సీఎం జగన్ లక్ష్యమని, ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు. జేసీ సీహెచ్ కీర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి నగరంలోని పలు డివిజన్‌లలో ఆయన పర్యటించారు. ఇంటి పట్టాలు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పట్టాలు పంపిణీ చేశారు. దుగ్గిరాల వీధి సచివాలయం నుంచి కొమరగిరి లేఅవుట్‌కు వెళ్తున్న లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం కొమరగిరి వెళ్లి ఇంటి పట్టాల లేఅవుట్ ప్రాంతంలో భూమి పూజ చేశారు.