-
-
Home » Andhra Pradesh » East Godavari » Holidays for Anganwadi schools till 31st
-
31వరకు అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవులు
ABN , First Publish Date - 2020-03-23T08:54:59+05:30 IST
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ పాఠశాలలు, మినీ

అమలాపురం, మార్చి 22 (ఆంధ్ర జ్యోతి): కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ పాఠశాలలు, మినీ పాఠశాలలను ఈనెల 31వవరకు మూసివేయాల్సిందిగా మహిళా శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఆయా జిల్లాల్లోని పీడీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆదేశాలు ఇచ్చారు.
ఆంధ్ర జ్యోతిలో అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవులు ఇవ్వరా? అనే శీర్షికన వార్తాకథనం ప్రచురి తమైన విషయం పాఠకులకు విదితమే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నివిద్యాసంస్థలకు సెలవులు ఇచ్చినప్పటికీ అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవులు ఇవ్వలేదనే అంశంపై వార్తాకథనం ప్రచురితమైంది. మహిళా శిశు సంక్షేమాధికారులు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈఅంశం ప్రస్తావనకు రావడంతో చర్యలు చేపట్టింది. ఈనెల31 వరకు మూసివేయాల్సిందిగా ఆదేశించింది.