రెహ్మత్‌నగర్‌లో అత్యున్నత ప్రమాణాలతో షాదీఖానా
ABN , First Publish Date - 2020-12-03T05:52:34+05:30 IST
రాజమహేంద్రవరం రెహ్మత్‌నగర్‌లో అత్యున్న ప్రమాణాలతో షాదీఖానాను వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆ పార్టీ పార్లమెంట్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఆరీఫ్ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 2: రాజమహేంద్రవరం రెహ్మత్‌నగర్‌లో అత్యున్న ప్రమాణాలతో షాదీఖానాను వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆ పార్టీ పార్లమెంట్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి ఆరీఫ్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చూపించిందని అందులో భాగంగానే రాజమహేంద్రవరంలోని రెహ్మత్‌నగర్ షాదీఖానాకు నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారని అయితే పనలు ప్రారంభం కాకపోవడంతో అది రద్దయ్యిందన్నారు. తాజాగా వైసీపీ నగర కోఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో రెహ్మత్‌నగర్ పెద్దలతో మాట్లాడి గత ప్రభుత్వం ప్రతిపాదనకంటే అత్యున్నతమైన స్థాయిలో షాదీఖానా నిర్మించి తీరుతారని చెప్పారు. గోదావరి జిల్లాలకే తలమానికమైన జాంపేట లైన్ మసీదుకు రూ.1.20 కోట్లు ఒకసారి, రూ.48 లక్షలు మరోసారి మంజూరైనట్టు అప్పటి ఎమ్మెల్యే, మేయర్లు శాంక్షన్ లేటర్లు ఇచ్చారన్నారు. అయితే అదంతా బూటకమని, తమ మనోభవాలను టీడీపీ గాయపరిచిందన్నారు. తమను మోసం చేసిందని గ్రహించిన మసీదు అధ్యక్షులు హబిబుల్లాఖాన్ టీడీపీకీ రాజీనామ చేశారని గుర్తుచేసారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నుద్ధేశించి మాజీ సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులు ఆలోచించుకోవాలన్నారు. సమావేశంలో మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు సయ్యద్ రబ్బానీ, ఆరిబుల్లాఖన్, ఎస్కె మస్తాన్, సయ్యద్ మదీనా, సయ్యద్ అల్తాఫ్, ఎస్కె షరీఫ్, నిజామ్ నజీషా పాల్గొన్నారు.