గోదారిలో.. అనుష్క!

ABN , First Publish Date - 2020-12-10T17:58:23+05:30 IST

సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని..

గోదారిలో.. అనుష్క!

పట్టిసం ఆలయానికి వెళ్లిన సినీ హీరోయిన్‌


సీతానగరం(తూర్పు గోదావరి): సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని గోదావరి నదిలో ప్రముఖ సినీనటి అనుష్క పడవపై ప్రయాణం చేస్తూ పట్టిసం వెళ్లారు. కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంసతో కలిసి పురుషోత్తపట్నంలోని పరమహంస నివాసానికి చేరుకున్నారు. అయితే అనుష్క పురుషోత్తపట్నం రాకను అత్యంత గోప్యంగా ఉంచారు. బుధవారం ఉదయం ఆమెతోపాటు స్నేహితురాలు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతి, రామకృష్ణ పరమహంస కుమార్తె మౌనికతో కలిసి గోదావరిలో పడవపై గండిపోచమ్మ గుడి, పట్టిసం వీరభద్రస్వామి ఆలయం సందర్శించుకుని మధ్యాహ్నం బెంగళూరు వెళ్లిపోయారు.

Updated Date - 2020-12-10T17:58:23+05:30 IST