భారీ వాహనాల రాకపోకలు ఆపాలి

ABN , First Publish Date - 2020-12-10T05:46:14+05:30 IST

శంఖవరం, డిసెంబరు 9: మండలంలోని కత్తిపూడి గ్రామ ంలో భారీ వాహనాల రాకపోకలు సాగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయిని, ఈ

భారీ వాహనాల రాకపోకలు ఆపాలి
కత్తిపూడిలో ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులు

కత్తిపూడిలో ఆందోళన

శంఖవరం, డిసెంబరు 9: మండలంలోని కత్తిపూడి గ్రామ ంలో భారీ వాహనాల రాకపోకలు సాగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయిని, ఈ రాకపోకలను నిలిపివేయాలని వైసీపీ నాయుకుడు గౌతు దొరబాబు ఆధ్వర్యాన పలువురు  బుధవారం ఆందోళన చేపట్టారు. భారీ వాహనాల వల్ల గ్రామంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. వాహనాల రాకపోకలు ఆపకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో గౌతు మాధవ, గౌతు శ్రీనివాస్‌, ప్రసాద్‌, చల్లా నాగు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T05:46:14+05:30 IST