భారీ వాహనాల నిలుపుదల
ABN , First Publish Date - 2020-12-13T05:58:27+05:30 IST
గిడజాంలో యువకులు శనివారం మధ్యా హ్నం భారీ వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు.

రౌతులపూడి, డిసెంబరు 12: గిడజాంలో యువకులు శనివారం మధ్యా హ్నం భారీ వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ఛిద్రమవుతున్నాయని ఆరోపించారు. గ్రామ మధ్యలో రహదారిపై ఏర్పడిన గొయ్యి వద్ద ఆందోళన చేశారు. అటువైపు వెళుతున్న తహశీల్దార్ ఎ.అబ్బాస్ లారీలు నిలిపివేతపై యువకులతో చర్చిం చారు. గొతులను కప్పితే లారీలను తిరగనిస్తామని యువకులు తహశీల్దార్‌కు తెలిపారు. క్వారీ యజమానులతో చర్చించగా గోతులను పూడ్చేం దుకు అంగీకరించడంతో లారీలను వదిలివేశారు.