పరిసరాల పరిశుభత్రతోనే ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-10-03T06:11:35+05:30 IST
మండలంలోని తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే
పెద్దాపురం, అక్టోబరు 2: మండలంలోని తాటిపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఆర్.వెంకటేశ్వరరావు, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, సీడీపీవో పంతం సావిత్రి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే వీర్రాఘవరావు, పులిమేరు పీఏసీఎస్ అధ్యక్షుడు గోపు నారాయణమూర్తి, యూత్ నాయకుడు గోపు మురళి పాల్గొన్నారు.