‘పోసియ్య’ ఆరోగ్యం బాగానే ఉంది

ABN , First Publish Date - 2020-03-24T06:51:57+05:30 IST

తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి కడియం మండలం కడియపుసావరం వచ్చిన ఎస్‌.పోసియ్యను

‘పోసియ్య’ ఆరోగ్యం బాగానే ఉంది

సీహెచ్‌సీ వైద్యుల నిర్ధారణ.. రిపోర్టుల పరిశీలన

ఈ నెల 21 టాంజానియా నుంచి కడియపుసావరానికి


కడియం, మార్చి 23: తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి కడియం మండలం కడియపుసావరం వచ్చిన ఎస్‌.పోసియ్యను సోమవారం వైద్య బృందం పరీక్షించింది. పోసియ్య కొన్నేళ్లు టాంజానియాలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 21న విమానంలో హైదరాబాద్‌ విమానశ్రయానికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి స్టాంపు వేశారు. జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు. విషయం తెలుసుకున్న కడియం సీహెచ్‌సీ వైద్యబృందం వెళ్లి పోసియ్య వైద్యరిపోర్టులు పరిశీలించింది.


పరిస్థితి బాగానే ఉన్నట్టు నిర్ధారించారు. 14 రోజులపాటు ప్రత్యేకరూమ్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా ఖతర్‌ నుంచి ఓ మహిళ, దుబాయ్‌ నుంచి ఓ యువకుడు ఈనెల 21న, ఇటలీలో చదువుకుంటున్న ఓ యువకుడు 22న మురమండ వచ్చారు. సమాచారం తెలుసుకున్న వైద్యులు ముగ్గురిని పరీక్షించారు. పరిస్థితి బాగానే ఉన్నట్టు గుర్తించారు. ప్రత్యేకరూమ్‌లో ఉండమని ఆదేశించారు. ఎప్పటికపుడు వారిని పరిశీలిస్తున్నారు.

Read more