హెచ్‌ఎంల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రమణారావు

ABN , First Publish Date - 2020-11-06T06:31:03+05:30 IST

రాజమహేంద్రవరం డివిజన్‌ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పాత తుంగపాడు జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు కేవీ రమణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హెచ్‌ఎంల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రమణారావు

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 5: రాజమహేంద్రవరం డివిజన్‌ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పాత తుంగపాడు జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు కేవీ రమణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక కోటగుమ్మం టీచర్స్‌ కమ్యూనిటీ హాలులో గురువారం ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్షుడిగా రమణారావు, కార్యదర్శిగా జివిఎస్‌ గణపతిరావు(గాదరాడ జడ్పీ హైస్కూల్‌), కోశాధికారిగా కమలాదాస్‌(మురమండ జడ్పీ హైస్కూల్‌) మహిళా ప్రతినిధిగా ఆర్‌.విజయదుర్గ (ధవళేశ్వరం జడ్పీ హైస్కూల్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీని సత్కరించారు. ఈ ఎన్నిక రంప ఎర్రం పాలెం జడ్‌పిహెచ్‌ ఎస్‌ హెచ్‌ఎం కోలా సత్యనారయణ పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది.

Updated Date - 2020-11-06T06:31:03+05:30 IST