కాకినాడలో గుప్తనిధుల కలకలం

ABN , First Publish Date - 2020-12-03T05:36:27+05:30 IST

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 2: కాకినాడలో వందేళ్లనాటి ఓ ఇంట్లో గుప్త నిఽధులు లభ్యమయ్యాయనే ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది. దేవాలయం వీధి సమీపంలోని గంజాంవారి వీధిలో ఉన్న సుమారు వందేళ్ల నాటి ఇంటిని కూల్చేందుకు నగరపాలక సంస్థ ఆదేశాలిచ్చిం

కాకినాడలో గుప్తనిధుల కలకలం

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 2: కాకినాడలో వందేళ్లనాటి ఓ ఇంట్లో గుప్త నిధులు లభ్యమయ్యాయనే  ప్రచారం నగరంలో జోరుగా సాగుతోంది. దేవాలయం వీధి సమీపంలోని గంజాంవారి వీధిలో ఉన్న సుమారు వందేళ్ల నాటి ఇంటిని కూల్చేందుకు నగరపాలక సంస్థ ఆదేశాలిచ్చింది. కూల్చే క్రమంలో కూలీలు గుప్త నిధులను గుర్తించినట్టు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్‌ ఇంటి యజమానికి చెప్పగా విషయం అధికారుల దృష్టికి వెళ్లకుండా వారిద్దరు పంపకాలకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ క్రమంలో కూల్చివేతను రాత్రి వేళల్లో చేపడుతున్నారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది.  రెవెన్యూ అధికారులు ఈ విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-12-03T05:36:27+05:30 IST