‘ఆదిత్య’లో గ్రూప్-1 పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-15T05:39:59+05:30 IST
గండేపల్లి, డిసెంబరు 14: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 275 మం
గండేపల్లి, డిసెంబరు 14: మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 275 మంది పురుషులు, మహిళలు 92 మంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 157 పురుషులు, 118 మంది మహిళలు హాజరైనట్టు చెప్పారు. ఆదిత్య యాజమాన్యం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరెడ్డి, కె.రామకృష్టారావు చీఫ్ సూపరింటెండెంట్‌గా, ఏపీపీఎ్‌ససీ ప్రతినిధి శ్రీనివాస్ బృందం పరిశీలనలో ఆదిత్య కళాశాలకు చెందిన ఎం.రాజాబాబు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన మాణిక్యాలరావు కోఆర్డినేటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లా డీఆర్వో సీహెచ్ సత్తిబాబు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, జగ్గంపేట సీఐ వి.సురే్‌షబాబు, గండేపల్లి ఎస్‌ఐ శోభన్‌కుమార్, జగ్గంపేట ఎస్‌ఐ టిరామకృష్ట, సిబ్బ ంది పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు చేపట్టారు.