సముద్ర తీరాల్ని గుల్ల చేస్తున్నారా??

ABN , First Publish Date - 2020-12-10T06:42:03+05:30 IST

కోనసీమలోని బంగాళాఖాతం సముద్రతీరం వెంబడి నిబంధనలకు విరు ద్ధంగా అక్రమ ఆక్వా సేద్యం, ఇసుక, మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది.

సముద్ర తీరాల్ని గుల్ల చేస్తున్నారా??
చెరువును పరిశీలిస్తున్న ఎన్జీటీ బృందం

  అక్రమ ఆక్వాసేద్యం, మట్టి తవ్వకాలను పరిశీలించిన ఎన్జీటీ బృందం 

 అక్కడి పరిస్థితులను చూసి విస్మయం

అమలాపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కోనసీమలోని బంగాళాఖాతం సముద్రతీరం వెంబడి నిబంధనలకు విరు ద్ధంగా అక్రమ ఆక్వా సేద్యం, ఇసుక, మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను ప్రత్యక్షంగా  పరిశీలించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. అధికారుల ప్రత్యక్ష ప్రమేయంతో తీరాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసి ప్రమా దకర పరిస్థితులను తీర గ్రామాలకు కల్పిస్తున్న తీరును బృందం సభ్యులు అణువణువునా శోధించారు. తీరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన ఆదేశాలను సైతం పరిశీలించిన అధికారులు తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. తీరం వెంబడి ప్రభుత్వ, అసైన్డ్‌ ల్యాండ్‌తో పాటు సముద్రానికి అతిచేరువలో ఉన్న భూములను ఆక్ర మించి ఆక్వా సేద్యం చేయడం వల్ల ఏర్పడుతున్న పర్యావ రణ పరిస్థితులపై కేశవదాసుపాలెంకు చెందిన యెనుముల వెంకటపతిరాజు చెన్నై గ్రీన్‌ట్రిబ్యునల్‌లో చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌ ఈ నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలో భాగంగా గ్రీన్‌ట్రిబ్యునల్‌ బృందంలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జాయింట్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ సి.పాల్పండి, సైంటిస్ట్‌ ఎం.మహిమలతోపాటు అధికారుల బృందం బుధ వారం తీర ప్రాంతంలోని చింతలమోరి, కేశవదాసుపాలెం, కరవాక, గోగన్నమఠం ప్రాంతాల్లో పర్యటించింది. ఆయా ప్రాంతాల్లోని స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలు సుకున్నారు. ఎంతకాలం నుంచి చెరువులు సేద్యం చేస్తు న్నారు, ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, ఇసుకను ఎక్కడికి తరలించారనే అంశాలపై స్థానికుల నుంచి సమా చారం తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లి తవ్విన భూములను పరిశీలించారు. జీపీఆర్‌ఎస్‌ సిస్టమ్‌ ద్వారా సముద్రానికి చెరువులు ఎంత దూరంలో ఉన్నాయో పరిశీలించారు. బోరు లు వేసిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూశారు. తీరంలో చెరువుల సాగుకు విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మ్‌ల ఏర్పాటు, చెరువులు ఎంత లోతు తవ్వారు, ఆ భూములు ఎవరివి వంటి సమాచారాన్ని స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. శంకరగుప్తంకు సంబంధించి స్ట్రయిట్‌కట్‌ వద్ద ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి తవ్వ కాలకు ఇచ్చిన అనుమతుల గురించి స్థానిక అధికారులను ఎన్జీటీ సభ్యులు వివరణ కోరారు. మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ ముత్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ్యులతోపాటు స్థానిక వైసీపీ నాయ కులు, ఇతర అధికారులు సమస్యలను ఎన్జీటీ సభ్యులకు వివరించారు. భాషాపరమైన సమస్య కారణంగా ఒక ట్రాన్స్‌లేటర్‌ ద్వారా తీరంలో జరుగుతున్న అక్రమ ఆక్వాసేద్యం, మట్టి తవ్వ కాల వల్ల కోనసీమలోని తీర గ్రామాల్లో ఉత్పన్నమవుతున్న ఆందోళనకర పరిస్థితులను సభ్యు లకు వివరించినప్పుడు వారు ఆసక్తికరంగా విన్నారు. సెల్‌ఫోన్‌లో కూడా చెరువులు తవ్విన దృశ్యాలను బంధించారు. మధ్యాహ్నం వరకు ఈ బృందం కోనసీమ తీరంలో పర్యటించి వెళ్లి పోయింది. ఈ అధ్యయన నివేదికను చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు అతిత్వరలోనే అందించను న్నట్టు సభ్యులు తెలిపారు. జిల్లాకు చెందిన అధికారుల నుంచి కూడా ప్రత్యేక నివేదికలు తీసు కుని వీటన్నింటినీ క్రోడీకరించి ఎన్జీటీకి నివేదిక సమర్పించనున్నారు. అయితే ఎన్జీటీ బృందం పర్యటన గోప్యంగా ఉంచడంతో స్థానికులకు సమాచారం లేక పూర్తి వివరాలను సభ్యులకు అందించ లేకపోయమంటూ ఆయా తీర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌ కలెక్టర్లు హిమాన్షుకౌశిక్‌, కేఎస్‌.విశ్వనాథ్‌తోపాటు పలువురు ఎన్జీటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T06:42:03+05:30 IST