గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-07T10:26:43+05:30 IST

జిల్లా గనులు, భూగర్భ వనరులశాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి రాష్ట్ర గనులు, భూగర్భ జలవనరులశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు...

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు

బిక్కవోలు, అక్టోబరు 6: అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం కాపవరంలో నివేశన స్థలాల కోసం నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నుంచి సేకరించిన 201 ఎకరాల్లో గ్రావెల్‌ అక్రమంగా తరలిపోయిందంటూ జిల్లా గనులు, భూగర్భ వనరులశాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి రాష్ట్ర గనులు, భూగర్భ జలవనరులశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపి మూడు టెంపరరీ పర్మిట్లతో అక్రమంగా గ్రావెల్‌ అమ్మకాలు జరిపారని ఆయన ఇబ్రహీంపట్నంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 


Read more