ఉద్యోగినితో సన్నిహితంగా వైసీపీ నాయకుడు?
ABN , First Publish Date - 2020-06-16T16:07:33+05:30 IST
గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు మహిళా ఉద్యోగినితో..

గ్రామ సచివాలయం గదిలో పట్టుబడ్డ వైనం
ప్రత్యేకాధికారిణి సమక్షంలో విషయం బట్టబయలు
అనపర్తి(తూర్పుగోదావరి): అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు మహిళా ఉద్యోగినితో సన్నిహితంగా ఉండడం సంచలనం రేకెత్తించాయి. సచివాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న మహిళ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సోమవారం ఒకే గదిలో ఉండగా గ్రామ ప్రత్యేకాధికారిణి వచ్చి వారిని బయటకు రప్పించారన్న విషయం మండలంలో దావానంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు వ్యవహారం బయటకు రాకుండా అధికారులతో మంతనాలు జరిపినట్టు వినికిడి.
ఈ విషయమై అనపర్తి ఎంఈవో, కుతుకులూరు ప్రత్యేకాధికారిణి కార్యాలయానికి చేరుకున్న మీడియా ఆమెను వివరణ కోరింది. తాను నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కుతుకులూరు పంచాయతీకి వెళ్లానని.. అక్కడ మహిళా ఉద్యోగిని ఒక గదిలో ఉండడం గమనించానని, ఆమెను ప్రశ్నించగా ఆరోగ్యం బాగోనందున పడుకున్నానని చెప్పిందని, కార్యాలయంలో అలా ఉండకూడదని మందలించానని వివరణ ఇచ్చారు. మీడియా అనపర్తిలోని ఎంఈవో కార్యాలయానికి చేరుకునే సరికి మహిళా ఉద్యోగిని అక్కడే ఉండడం కొసమెరుపు.