ఎంపీటీసీ స్థానానికి..గ్రామ వలంటీర్‌ పోటీ

ABN , First Publish Date - 2020-03-13T09:30:31+05:30 IST

ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడం కోసం గ్రామ వలంటీర్‌ ఉద్యోగానికి ఆ యువతి రాజీనామా చేసింది. పాఠశాల, విద్యా కమిటీ సభ్యురాలి పదవికి సైతం రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో

ఎంపీటీసీ స్థానానికి..గ్రామ వలంటీర్‌ పోటీ

విద్యా కమిటీ సభ్యురాలి పదవి కూడా రాజీనామా 


పెద్దాపురం, మార్చి 12: ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడం కోసం గ్రామ వలంటీర్‌ ఉద్యోగానికి ఆ యువతి రాజీనామా చేసింది. పాఠశాల, విద్యా కమిటీ సభ్యురాలి పదవికి సైతం రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో ఆమె ఎంపీటీసీ అభ్యర్థిగాటీడీపీ తరుపున పోటీ చేస్తోంది. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామ ఎంపీటీసీ-1 స్థానానికి నంది ఉమామహేశ్వరి నామినేషన్‌ దాఖలు చేసింది. తాను గ్రామ వలంటీర్‌, విద్యా కమిటీ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించింది. రాజీనామా లేఖను సంబంధిత అధికారులకు అందజేసింది. దీంతో ఆమెను పలువురు అభినందిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తాను ప్రజా సమస్యలను తనవంతు పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి చేరినట్లు ఆమె చెబుతోంది. 


తుపాకులు, తూటాలు.. ఇచ్చేయాలి మరి..!

సామర్లకోట: జిల్లాలో లైసెన్స్‌ పొందిన వ్యక్తులనుంచి తుపాకులు, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత వీటిని తిరిగి వారికి అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 474 లైసెన్స్‌ తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది.

Updated Date - 2020-03-13T09:30:31+05:30 IST