పంచాయతీల్లో గ్రామసభలు
ABN , First Publish Date - 2020-10-03T07:16:55+05:30 IST
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు.

కాట్రేనికోన, అక్టోబరు 2: మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. కొవిడ్ సేవలందించిన పారిశుధ్య కార్మికులకు అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. వలంటీర్లు, గ్రామసచివాలయ వ్యవస్థ ఏడాది పూర్త యిన సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కె.సీహెచ్.అప్పారావు, ఈవోపీఆర్డీ కె.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ నాగలక్ష్మమ్మ పాల్గొన్నారు.