ప్రజాసమస్యలపై గ్రామ సభ

ABN , First Publish Date - 2020-10-03T06:26:21+05:30 IST

జగ్గంపేటలోని సచివాలయం-1లో గ్రామ కార్యదర్శి గణేష్‌బాబు అధ్యక్షతన శుక్రవారం ప్రజాసమస్యలపై గ్రామసభ నిర్వహించారు.

ప్రజాసమస్యలపై గ్రామ సభ

జగ్గంపేట, అక్టోబరు 2: జగ్గంపేటలోని సచివాలయం-1లో గ్రామ కార్యదర్శి గణేష్‌బాబు అధ్యక్షతన శుక్రవారం ప్రజాసమస్యలపై గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో అడపా వెంకటలక్ష్మి, ఇతర శా ఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, గ్రామస్థులు పాల్గొ న్నారు. ముందుగా మహాత్మగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనం తరం పలువురు గ్రామంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఒమ్మి రఘురామ్‌ మాట్లాడుతూ జగ్గంపేట పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా వారియర్స్‌గా సేవలందించిన పారిశుధ్య కార్మికులకు రూ.1500, డ్రైఫ్రూట్స్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్దాడ రాజబాబు, కరుటూరి రాజు, ఆర్‌.జగాలు, గఫూర్‌, గంట రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:26:21+05:30 IST