భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:57:46+05:30 IST

శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఏకాదశి, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం కలిసిరావడంతో లక్ష్మీనారాయణుల దర్శనానికి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

గోదావరి సిటీ, డిసెంబరు 25:  శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఏకాదశి, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం కలిసిరావడంతో లక్ష్మీనారాయణుల దర్శనానికి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో తెల్లవారు జామునుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. నలమందు సందులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం లో, గౌతమఘాట్‌ శ్రీరంగధామంలో,  ఆనంకళాకేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో, తిలక్‌రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో, జమీందార్‌ మెట్టపై ఉన్న శ్రీభూనీలా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో, ప్రకాష్‌నగర్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో, వంకాయలవారి వీధి శ్రీఅష్టలక్ష్మి ఆలయంలో, కోరుకొండరోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో, దేవీచౌక్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో, భక్తులు స్వామికి విశేష పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.  ఏవీ అప్పారావు రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్‌ను పారద్రోలి ప్రజలకు సుఖశాంతులు కలగాలని ఆయన స్వామిని ప్రార్ధించారు. ఆయనతో చందననాగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆనంకళాకేంద్రం ఆవరణలో శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామిని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జమీందార్‌ మెట్ట శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ సిటీ కోఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి గట్టున ఉన్న క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయంలో గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ణ ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామికి  పూజలు నిర్వహించారు.


Updated Date - 2020-12-26T05:57:46+05:30 IST