-
-
Home » Andhra Pradesh » East Godavari » Governments have failed to curb attacks on Dalits
-
దళితులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2020-10-07T09:24:18+05:30 IST
దళితులపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీఏపీఎస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ విమర్శించారు...

కేవీఏపీఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాజశేఖర్
హత్రాస్‌లోని హత్యాచార ఘటనపై నిరసనలు
అన్నవరం, ప్రత్తిపాడులో కొవ్వొత్తుల ర్యాలీ
పిఠాపురం, అక్టోబరు 6: దళితులపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీఏపీఎస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ విమర్శించారు. కేవీఏపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దళితుల రక్షణ యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలు, మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా మంగళవారం సాగింది. ఉప్పాడ సెంటర్‌లో జరిగిన సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 200కిపైకి దాడులు జరిగాయన్నారు. దళితుల శిరోముండనాల సంఘటనలు సిగ్గు చేటన్నారు. ఐద్వా, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత, రైతు సంఘాలు, సీఐటీయూ, మద్యపాన వ్యతిరేక ప్రచారకమిటీల ప్రతినిధులు దడాల నాగవెంకటలక్ష్మి, కూరాకుల సింహాచలం, గురాల అప్పారెడ్డి, కాళ్ల నాగేశ్వరరావు, కోనేటి రాజు, కరణం విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
‘హత్రాస్’ ఘటనపై నిరసన ర్యాలీ
అన్నవరం, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన హత్యా చార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీ యూ, భారత రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వ హించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.గంగాసూరిబాబు మాట్లా డుతూ దేశంలో రోజురోజుకు అత్యాచారాలు, హత్యలు పెరుగుపోతున్నాయని, చట్టాలు సక్రమంగా పనిచేయడంలేదని, అవి కొందరికి చుట్టాలుగా మారా యని పేర్కొన్నారు. మద్యం, మాదకద్రవ్యాలను, అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దేవి శ్రీప్రసాద్, శివరాజు, వీరబాబు, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడులో..
ప్రత్తిపాడు, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యా చారాలకు నిరసనగా ప్రత్తిపాడులో సీఐటీయూ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హత్రాస్‌లోని దళిత యువతిని హత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకా రులు అన్నారు. స్థానిక బస్‌కాంప్లెక్స్ సెంటర్ నుంచి ప్రధాన రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ సంఘటనపై బీజేపీ నాయకులు నోరు మెదపడంలేదని వారు మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ, సీపీఎం నాయకులు రొంగల ఈశ్వరరావు, ఎన్.శ్రీను, అప్పారావు, వి.రాంబాబు, దొరబాబు, సురేష్ పాల్గొన్నారు.