బంగారు గొలుసు చోరీ

ABN , First Publish Date - 2020-11-21T06:30:30+05:30 IST

ఓ వృద్ధురాలిని మెడలో బంగారు గొలుసును ఇద్దరు యువకులు లాక్కుని పరారయ్యారు.

బంగారు గొలుసు చోరీ

అమలాపురం టౌన్‌, నవంబరు 20: ఓ వృద్ధురాలిని  మెడలో బంగారు గొలుసును  ఇద్దరు యువకులు  లాక్కుని పరారయ్యారు. అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన కొల్లూరి వెంకటసూర్య సుబ్బలక్ష్మి(60) శుక్రవారం కళావెంకట్రావు వీధి నుంచి ఏఎస్‌ఎం కళాశాల వైపు నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు వెంబడించారు. కళాశాల గేటు వద్ద ఆమె మెడలోని రూ.64వేలు విలువైన నాలుగుకాసుల బంగారు గొలుసును ఆ ఇద్దరు యువకులు లాక్కుని మోటార్‌సైకిల్‌పై వెళ్లిపోయారు. సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్‌ తెలిపారు. 


Read more