-
-
Home » Andhra Pradesh » East Godavari » Give my husband better healing
-
‘నా భర్తకు మెరుగైన వైద్యం అందించండి’
ABN , First Publish Date - 2020-10-07T08:32:01+05:30 IST
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తన భర్తకు మెరుగైన వైద్యం అందేలా అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు వాసి షేక్ సత్తార్ భార్య సమీరా బేగం విజ్ఞప్తి చేశారు...

కాకినాడ క్రైం, అక్టోబరు 5: కుమార్తెపై అత్యాచారయత్నం జరగడంతో పాటు తన భర్త తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు వాసి షేక్ సత్తార్ భార్య సమీరా బేగం విజ్ఞప్తి చేశారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తన భర్తకు మెరుగైన వైద్యం అందేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఆస్పత్రి ఆవరణలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ అత్యాచారయత్నానికి గురైన తన కుమార్తెకు ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని ఖర్చులు భరిస్తామని వైసీపీకి చెందిన కొందరు పెద్దలు హామీ ఇచ్చినట్లు చెప్పారు. కుటుంబం కోసం ఆలోచించకుండా తీవ్ర ఒత్తిడిలో తన భర్త సత్తార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చాలా బాఽధగా ఉందన్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సత్తార్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంగళవారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ జీజీహెచ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సత్తార్‌ను పరామర్శించారు. బాఽధితునికి అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని బాధితుడి భార్య సమీరా బేగంకు హామీ ఇచ్చారు. అలాగే రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ రమాదేవి కూడా పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.