చిన్నారిపై అత్యాచారం బాధాకరం
ABN , First Publish Date - 2020-12-01T06:16:44+05:30 IST
సభ్య సమాజం సిగ్గు పడేలా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ అన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్
జీజీహెచ్(కాకినాడ), నవంబరు 30: సభ్య సమాజం సిగ్గు పడేలా ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం దురదృష్టకరమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ అన్నారు. అత్యాచార యత్నానికి గురై ప్రాణాపాయస్థితిలో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని సోమవారం హర్షకుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచార యత్నానికి గురైన బాలికకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు అయినా ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదన్నారు. కాకినాడ జగన్నాఽథపురంలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి మల్లిపూడి రాంబాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ తదితరులు ఉన్నారు.