బాలికను మోసగించిన యువకుడిపై కేసు

ABN , First Publish Date - 2020-12-27T07:05:46+05:30 IST

ప్రేమ పేరుతో బాలికను మోసగించిన వ్యక్తిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దానేటి రామారావు తెలిపారు. కరప మండలం అరట్లకట్ట గ్రామంలో పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన చెల్లె మహేష్‌ మూడేళ్ళు నుంచి ప్రేమ పేరుతో లొంగదీసుకుని పలుమార్లు శారీరకంగా అనుభవించాడు.

బాలికను మోసగించిన యువకుడిపై కేసు

కరప, డిసెంబరు 26: ప్రేమ పేరుతో బాలికను మోసగించిన వ్యక్తిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దానేటి రామారావు తెలిపారు. కరప మండలం అరట్లకట్ట గ్రామంలో    పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన చెల్లె మహేష్‌ మూడేళ్ళు నుంచి ప్రేమ పేరుతో లొంగదీసుకుని పలుమార్లు శారీరకంగా అనుభవించాడు. పెద్దల నుంచి ఇబ్బందులు వస్తాయని భావించి ఎవరికీ చెప్పకుండా ఈనెల 24వ తేదీ రాత్రి  ఇద్దరూ వెళ్లిపోయి కాకినాడలోని పలు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఆపై శారీరకంగా అనుభవించడానికి మాత్రమే ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పానని, పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని మహేష్‌ తెగేసి చెప్పడంతో బాధితురాలు బోరున విలపిస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారి సాయంతో బాధితురాలు శనివారం కరప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.


Updated Date - 2020-12-27T07:05:46+05:30 IST