-
-
Home » Andhra Pradesh » East Godavari » GGH as Non Kovid Hospital from tomorrow
-
రేపటి నుంచి నాన్ కొవిడ్ ఆసుపత్రిగా జీజీహెచ్
ABN , First Publish Date - 2020-10-07T08:05:32+05:30 IST
గురువారం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో అన్ని రకాల వైద్య సేవలు అమలు చేస్తున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు...

జీజీహెచ్ (కాకినాడ), అక్టోబరు 6: గురువారం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో అన్ని రకాల వైద్య సేవలు అమలు చేస్తున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యం లో ప్రభుత్వం జీజీహెచ్‌ను ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో నాన్ కొవిడ్ కేసులను ఇతర ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రులకు ఇప్పటివరకు పంపడం జరిగిందన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్ని రకాల వైద్య సేవలను క్రమేపీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.