జమిలీ ఎన్నికలకు సిద్ధంకండి..
ABN , First Publish Date - 2020-10-03T07:27:19+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ

అమలాపురం లోక్‌సభ పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు
జూమ్ యాప్ ద్వారా సమీక్ష
అమలాపురం (ఆంధ్రజ్యోతి) అక్టోబరు 2: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు 750 మందికిపైగా టీడీపీ నాయ కులు, కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా బాబుతో లైవ్ సమీక్షలో పాల్గొన్నారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ముగ్గురు నాయకులతో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 2022లో రానున్న జమిలీ ఎన్ని కల నాటికి పార్టీ కేడర్ అంతా సంసిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు టీడీపీ నేతల్లో అనూహ్య మైన ఉత్సాహాన్ని నింపింది. జమిలీ ఎన్నికలు దేశంలో వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా అప్పటికి ప్రతి కార్యకర్త విబేధాలను విస్మరించి పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పని చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
జమిలీ ఎన్నికల ప్రస్తా వన స్వయంగా టీడీపీ అధినేతే లోక్‌సభ పార్లమెంటరీ సమావేశంలో ప్రస్తా వించడంతో సర్వత్రా చర్చనీయాం శమైంది. లోక్‌సభ పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్, అమలాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, పి.గన్నవరం నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, డొక్కా నాథ్‌బాబు, మండపేట నుంచి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాజోలు నుంచి మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావులతో పాటు నియోజకవర్గానికి ముగ్గురు నాయకులతో మా ట్లాడించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జిని నియ మించాలని ఓ నాయకుడు చంద్రబాబును కోరగా త్వర లోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చినట్టు సమాచారం.
అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు గా నియమితులైన రెడ్డి అనంతకుమారి చంద్రబాబుతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కమిటీలు అన్నింటినీ పూర్తిచేసి పార్టీ పిలుపు మేరకు ప్రజల ముందుకు వెళతానన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జిల అక్ర మాలపై ఆందోళన చేస్తున్నామని, అంతర్వేది రథం దగ్ధం, సముద్రతీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు వంటి అంశాలపై తాము పోరాడుతున్నామని చెప్పారు.