స్వల్పంగా గ్యాస్‌ లీకేజీ

ABN , First Publish Date - 2020-12-07T05:55:01+05:30 IST

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో పొలాల గట్ల వద్ద ఆదివారం స్వల్పంగా గ్యాస్‌ లీకయింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఓఎన్జీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వాల్వ్‌ను అదుపుచేసి గ్యాస్‌ లీకేజీని అరికట్టారు.

స్వల్పంగా గ్యాస్‌ లీకేజీ

అంతర్వేది, డిసెంబరు 6: సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో పొలాల గట్ల వద్ద ఆదివారం స్వల్పంగా గ్యాస్‌ లీకయింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఓఎన్జీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వాల్వ్‌ను అదుపుచేసి గ్యాస్‌ లీకేజీని అరికట్టారు. అంతర్వేది తీర ప్రాంతాల నుంచి కేశవదాసుపాలెం మీదుగా మోరి జీసీఎస్‌కు వెళ్లే పైపులైను నుంచి పంట పొలాల మధ్య ఈ లీకేజీ జరిగిందని, తక్కువ సమయంలోనే గ్యాస్‌ లీకేజీని నియంత్రించినట్టు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. 


 

Updated Date - 2020-12-07T05:55:01+05:30 IST