29న ఉచిత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-03-24T06:52:55+05:30 IST

కరోనా నేపథ్యంలో ఈ నెల 29న జిల్లాలో ఉచిత రేషన్‌ పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపధ్యంలో

29న ఉచిత రేషన్‌ పంపిణీ

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి 23: కరోనా నేపథ్యంలో ఈ నెల 29న జిల్లాలో ఉచిత రేషన్‌ పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ విజృంభించకుండా ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించి వాహనాలపై నిషేధం విధించడంతోపాటు బస్‌ల రాకపోకలు నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు దృష్టిసారించారు. దీనిలో భాగంగా ఏప్రిల్‌ నెల రేషన్‌ సరుకులు ఈ నెల 29న ఇవ్వాలని నిర్ణయించారు.


ఇందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 17 లక్షల వరకు రేషన్‌ కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు రేషన్‌ సరుకుల పంపిణీ నిమిత్తం బియ్యం 22,623 టన్నులు, పంచదార 791 టన్నులు, కందిపప్పు 3,071 టన్నులు కావాల్సి ఉంది. అయితే కందిపప్పు కొరత ఉన్నందున దీనిని అధిగమించేందుకు దృష్టి సారించారు. 


Updated Date - 2020-03-24T06:52:55+05:30 IST