చోరీ కేసులో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-03T06:25:04+05:30 IST

పిఠాపురంలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్టు సీఐ రామచంద్రరావు తెలిపారు

చోరీ కేసులో నలుగురి అరెస్టు

పిఠాపురం, అక్టోబరు 2: పిఠాపురంలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్టు సీఐ రామచంద్రరావు తెలిపారు. కొంతకాలంగా పట్టణంలో సీతయ్యగారితోట, వేణుగోపాలస్వామి గుడి వీధి, చిట్టోడితోట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని, వారి నుంచి రూ.2 లక్షలు విలువైన వెండి, బంగారు ఆభరణాలు, రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. కేసు చేధించడంలో కృషి చేసిన ఎస్‌ఐ సంపత్‌, ఏఎస్‌ఐ రమణ, క్రైంపార్టీ సుబ్బారావు, లక్ష్మణరెడ్డి, రామకృష్ణలను అభినందించారు.

Updated Date - 2020-10-03T06:25:04+05:30 IST