23న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా..: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌

ABN , First Publish Date - 2020-11-21T06:42:44+05:30 IST

క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సంఘటితంగా కృషి చేద్దామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు.

23న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా..: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌

అమలాపురం టౌన్‌, నవంబరు 20: క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సంఘటితంగా కృషి చేద్దామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. అమలాపురం దుడ్డువారి అగ్రహారంలోని ముస్లిం షాదీఖానా భవనంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 23న రాజమహేంద్రవరంలోని చెరుకూరి కళ్యాణ మండపంలో తాను మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌పార్టీ ఏపీ ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ తదితర ప్రముఖులు హాజరువుతారన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్లమెంటు అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల సుభాషిణి, నాయకులు కల్వకొలను తాతాజీ, పెన్మత్స జగ్గప్పరాజు, షెహన్‌షా, వంటెద్దు బాబి, గెడ్డం సురేష్‌బాబు, ముషిణి రామకృష్ణారావు, దోనిపాటి విజయలక్ష్మి, తోపెల్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.Read more