‘అక్నూ’లో ఘనంగా ఫుడ్‌ ఫెస్టివల్‌

ABN , First Publish Date - 2020-03-08T09:22:09+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడ రూరల్‌ మండలం

‘అక్నూ’లో ఘనంగా ఫుడ్‌ ఫెస్టివల్‌

తిమ్మాపురం (సర్పవరం జంక్షన్‌), మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం అక్నూ ఎంఎ్‌సఎన్‌ క్యాంప్‌సలో ఎన్‌ఎ్‌సఎస్‌, సెట్రాజ్‌, హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యాన ఫుడ్‌ ఫెస్టివల్‌  ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు పూతరేకుల్ని తయారుచేసి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దేశీయ వంటకాలైన పులిహార, జీలకర్ర రైస్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌ హల్వ, స్వీట్‌కార్న్‌.. యోగా విభాగం ఆధ్వర్యంలో యోగా రైస్‌, యోగా బిర్యానీ, కుండ మజ్జిగ, రాగిలడ్డు, రవ్వలడ్డు, మెహందీ వంటి వంటకాలతో అదరగొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2020-03-08T09:22:09+05:30 IST