‘వరద పరిరక్షణ పనులు కేంద్రం చేపట్టాలి’

ABN , First Publish Date - 2020-09-24T07:57:14+05:30 IST

యానాం నియోజకవర్గంలో వరద పరిరక్షణ పనులు కేంద్రం తక్షణమే చేపట్టాలని సీఎం వి.నారాయణసామి, మంత్రి మల్లాడి కృష్ణారావులు కోరారు

‘వరద పరిరక్షణ పనులు కేంద్రం చేపట్టాలి’

యానాం, సెప్టెంబరు 23: యానాం నియోజకవర్గంలో వరద పరిరక్షణ పనులు కేంద్రం తక్షణమే చేపట్టాలని సీఎం వి.నారాయణసామి, మంత్రి మల్లాడి కృష్ణారావులు కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా  సీఎం నారాయణసామి, మంత్రి మల్లాడి కృష్ణారావులు కేంద్ర మంత్రులను కలిశారు. గవర్నర్‌ ఇబ్బందులు గురిచేస్తున్న నేపథ్యంలో కేంద్రమే పనులు చేపట్టాలని కోరారు.  ప్రతీ సంవత్సరం వచ్చే  వరదలకు యానాంలోని అనేక ప్రాంతాలు నీటిమునిగి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఫొటోలతో సీఎం, మంత్రి మల్లాడి కేంద్ర మంత్రికి వివరించారు. యానాం అభివృద్ధి పనులపై చర్చించారు. జీఎస్‌పీసీ నిధులకు సం బంధించి పలువురు కేంద్ర మంత్రులు, హోంశాఖ కార్యదర్శితో చర్చించేందుకు గురువారం అపాయిమెంట్‌ కోరినట్టు మల్లాడి తెలిపారు.

Updated Date - 2020-09-24T07:57:14+05:30 IST