దసరా, దీపావళికి ఐదు ప్రత్యేక రైళ్లు!
ABN , First Publish Date - 2020-10-08T07:17:04+05:30 IST
దీపావళి పండగలకు ఐదు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించారు...

రాజమహేంద్రవరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండగలకు ఐదు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించారు. వీటిలో సికింద్రాబాద్ నుంచి గౌహతి వీక్లీ, కడప నుంచి విశాఖ డైలీ, నాగ్‌పూర్ నుంచి సీఎస్‌ఎంటీకి డైలీ, సికింద్రాబాద్ నుంచి ఎన్‌హెచ్‌డబ్ల్యుకు డైలీ, భువనేశ్వర్ నుంచి ఎస్‌బీసీకి డైలీ వున్నాయి. కొద్ది రోజుల్లోనే వీటికి ఆమోదం లభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం జిల్లా మీదగా నాలుగు రైళ్లు రెండువైపులా రాకపోకలు సాగిస్తుండగా మూడు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. అన్‌లాక్ 5.0 ప్రారంభం కావడంతో అన్ని రైల్వే స్టేషన్లనూ తెరిచారు. గతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎక్కడ ఆగేవో అక్కడ ఆగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది.