మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2020-10-03T07:38:13+05:30 IST

ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి పెంపొందించుకోవాలని మత్స్య శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు (జేడీ)

మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి పెంపొందించుకోవాలి

మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడు సత్యనారాయణ


ఏలేశ్వరం, అక్టోబరు 2: ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి పెంపొందించుకోవాలని మత్స్య శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు (జేడీ) పీవీ సత్యనారాయణ, సహాయ సంచాలకులు వి.కృష్ణారావు, కె.కరుణకుమార్‌ చెప్పారు. శుక్రవారం వారు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌తో కలిసి ఏలేరు రిజర్వాయర్‌ను సందర్శించారు. మత్స్యకారుల జీవనోపాధి నిమిత్తం వేట్లపాలెం, ద్వారపూడి ప్రాంతాల నుంచి తీసుకొవచ్చిన పది లక్షల చేప పిల్లలను పెంపకం నిమిత్తం ఏలేరు జలాశయంలో ప్రభుత్వ మత్స్య శాఖకు చెం దిన పంజరం (కేజ్‌ కల్చర్‌)లో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, తొండారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:38:13+05:30 IST