-
-
Home » Andhra Pradesh » East Godavari » fire accsident
-
ఏలేశ్వరంలో వరిగడ్డి వాహనం దగ్ధం
ABN , First Publish Date - 2020-12-10T05:50:16+05:30 IST
ఏలేశ్వరం, డిసెంబరు 9: పట్టణంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డిని తరలిస్తున్న వాహనం పూర్తిగా దగ్ధమైంది. మండల పరిధిలోని

ఏలేశ్వరం, డిసెంబరు 9: పట్టణంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డిని తరలిస్తున్న వాహనం పూర్తిగా దగ్ధమైంది. మండల పరిధిలోని లింగంపర్తి గ్రామానికి చెందిన గడ్డం సూర్యనారాయణ అనే డ్రైవర్ తన బొలేరో వాహనంలో పట్టణంలోని పొలంలో నుంచి ఎండుగడ్డిని పశువుల మేత నిమిత్తం తీసుకువస్తున్నాడు. మార్గంమధ్యలో గోదావరి జలాల సరఫరా పైపులైన్ మార్గంలో విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ వాహనం పై ఉన్న గడ్డికి తగలడంతో మంటలు వెలువడ్డాయి. వాహనంతో పాటు గడ్డి పూర్తిగా దగ్ధమై రైతు, డ్రైవర్‌కు తీవ్ర నష్టం కలిగింది.