సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి

ABN , First Publish Date - 2020-10-07T09:19:48+05:30 IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్ఠి చేకూరుతుందని జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి (అభివృద్ధి) అన్నారు...

సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి

జేసీ కీర్తి.. జి.రాగంపేటలో ఎస్‌డబ్ల్యూఎం సెంటర్‌ పరిశీలన


పెద్దాపురం, అక్టోబరు 6: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలకు ఆర్థిక పరిపుష్ఠి చేకూరుతుందని జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి (అభివృద్ధి) అన్నారు. మండలంలోని జి.రాగంపేటలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో సేంద్రియ ఎరువు తయారీ,  ప్యాకింగ్‌ విధానాలను గ్రీన్‌ అంబాసిడర్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్రంలో తయారైన ఎరువులను విక్రయించుకోవడం ద్వారా పంచాయతీలకు ఆదాయం చేకూరుతుందని అన్నారు. అనంతరం గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, మార్కెట్‌ సదుపాయం విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీవో నాగేశ్వరనాయక్‌, ఆర్డీవో మల్లిబాబు, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సెలెట్‌రాజు, బండారు వీరబాబు పాల్గొన్నారు.

Read more