దాడికేసులో ఆరుగురికి జరిమానా

ABN , First Publish Date - 2020-12-19T06:41:02+05:30 IST

కడియపులంక పంచాయతీ పరిఽధిలో వెంకయ్యపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గాయపరిచిన కేసులో 6 గురు వ్యక్తులకు ఒక్కొక్కరికీ రూ. 3వేల చొప్పున శుక్రవారం కోర్టు జరిమానా విధించింది.

దాడికేసులో ఆరుగురికి జరిమానా

కడియం, డిసెంబరు 18: కడియపులంక పంచాయతీ పరిఽధిలో వెంకయ్యపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని గాయపరిచిన కేసులో 6 గురు వ్యక్తులకు ఒక్కొక్కరికీ రూ. 3వేల చొప్పున శుక్రవారం కోర్టు జరిమానా విధించింది. కడియం సీఐ కె. శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2016 మార్చి 3వ తేదీన వెంకయ్యపేట గ్రామానికి చెందిన జనుపల్లి జయలక్ష్మి, త్రిమూర్తులు, యర్రబిల్లి కనకదుర్గ, సలాది లావణ్య, వందే శ్రీను, అనసూరి భవానీ అను వారు దాడి చేసి తనను గాయపరిచినట్లు అదే గ్రామానికి చెందిన పల్లా దుర్గాప్రసాద్‌ కడియం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఏఎస్‌ఐ కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్టు చేసి రాజమహేంద్రవరం 7వ ఏజేఎఫ్‌ సీఎం కోర్టుకు హాజరుపరిచారు. దీనిపై విచారణ చేసిన కోర్టు శుక్రవారం పైవారిని దోషులుగా తేల్చి ఆరుగురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున జరిమానా విధించారు. 7వ కోర్డు ఏపీపీ మహాలక్ష్మి, ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఎల్‌. కనకరాజు, కోర్డు కానిస్టేబుల్‌ గంగాధర్‌లను కడియం సీఐ కె.శ్రీధరకుమార్‌ అభినందించారు.


Updated Date - 2020-12-19T06:41:02+05:30 IST